ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-07-27T05:27:18+05:30 IST

ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టాభిపురం పోలీసులు అరెస్టుచేశారు.

ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న వెస్టు డీఎస్పీ సుప్రజ, పక్కన సీఐ రాజశేఖరరెడ్డి, వెనుక నిందితులు

గుంటూరు, జూలై 26: ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టాభిపురం పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో వెస్టు డీఎస్పీ సుప్రజ నిందితులైన గోరంట్లకు చెందిన చొల్లంగి సురేష్‌, అమరావతి రోడ్డులోని అరుంధతినగర్‌కు చెందిన కోలవేణి రవీంద్రలను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. గత 11ఏళ్లుగా సురేష్‌ ఇళ్ల దొంగతనాలకు  పాల్పడుతున్నాడు. గుంటూరు అర్బన్‌,రూరల్‌, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని పలు పోలీస్‌స్టేషన్లలో సురేష్‌పై చోరీకేసులు ఉన్నాయి. జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత ఓ షాపింగ్‌మాల్‌లో సెక్యూరిటీగా ఉంటూ తన స్నేహితుడు రవీంద్రతోకలిసి మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. నిందితులను అరెస్టు చేసి చోరీసొత్తు కొంతమే స్వాధీనం చేసుకున్నారు. తాకట్టుపెట్టిన సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. నిందితులను అరెస్టు చేసిన సీఐ రాజశేఖరరెడ్డి, ఎస్‌ఐ అబ్దుల్‌ రెహ్మాన్‌, హెడ్‌కానిస్టేబుళ్లు ఎండీజానీ, బి.శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ పి.హనుమంతరావులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. 

 

Updated Date - 2021-07-27T05:27:18+05:30 IST