మీరు కరోనా హాట్‌స్పాట్‌లో నివశిస్తున్నారా? అయితే జర జాగ్రత్త

ABN , First Publish Date - 2020-04-09T13:58:32+05:30 IST

మీరు కరోనా హాట్‌స్పాట్‌లో నివశిస్తున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు సర్కారు అధికారులు....

మీరు కరోనా హాట్‌స్పాట్‌లో నివశిస్తున్నారా? అయితే జర జాగ్రత్త

న్యూఢిల్లీ : మీరు కరోనా హాట్‌స్పాట్‌లో నివశిస్తున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు సర్కారు అధికారులు...కరోనా హాట్‌స్పాట్‌లో ఏం చేయాలో, ఏం చేయకూడదో అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మీరు కరోనా హాట్‌స్పాట్‌లో నివశిస్తుంటే మీకు కావాల్సిన నిత్యావసర సరకులు, కూరగాయలు, మందులను కొనుగోలు చేసేందుకు కూడా ఇంటి నుంచి బయటకు అనుమతించరు...దేశంలో కరోనా వైరస్ కేసులు అధికంగా వెలుగుచూసిన హాట్‌స్పాట్‌లను బుధవారం అర్దరాత్రి నుంచి ఈ నెల 30వతేదీ వరకు దిగ్బంధం చేస్తూ పలు రాష్ట్రప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.


కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి ఆంక్షలు విధించారు. ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారాణసీ, షామిల్, మీరట్, బరేలీ, బులంద్ షహర్, ముంబై, భోపాల్ తదితర ప్రాంతాలను దిగ్బంధం చేశారు. ఆరుగురి కంటే ఎక్కువ మంది కరోనా రోగులున్న ప్రాంతాల్లో ఈ దిగ్బంధం ఆంక్షలు విధించారు. కరోనా రోగులున్న ఇళ్లకు సీలు వేశారు. కరోనా హాట్‌స్పాట్లలోకి వచ్చి, పోయే రహదారులను మూసివేశారు. 


కరోనా హాట్‌స్పాట్లలో చేయకూడనివి...

  1. ఈ కరోనా హాట్‌స్పాట్లలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. 
  2. ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, మందుల కోసం కూడా బయటకు అనుమతించరు. 
  3. కరోనా హాట్‌స్పాట్లలోకి మీడియాను కూడా అనుమతించరు. 


కరోనా హాట్‌స్పాట్లలో ఏం చేస్తారంటే...

  1. కరోనా హాట్‌స్పాట్లలో ఇంటింటికి వైద్యశాఖ ఆరోగ్యకార్యకర్తలు వచ్చి సర్వే చేస్తారు.
  2. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాన్ని మున్సిపల్ సిబ్బంది శానిటైజేషన్ చేసి, క్రిమిసంహారకాలను స్ప్పే చేస్తారు. 
  3. నిత్యావసరాలు, మందులను ఇంటి నుంచి ఆర్డరు చేసుకోవాలి. 
  4. ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అంబులెన్స్ కోసం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. 

Updated Date - 2020-04-09T13:58:32+05:30 IST