నాకోసం మారావా నువ్వు?!

నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కృతిశెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్‌ కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్డూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ‘నా కోసం మారావా నువ్వు..’ అనే పాటని ఆదివారం విడుదల చేశారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సిద్ద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ఇది ప్రీక్వెల్‌. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా బంగార్రాజుగా.. నాగ్‌ గెటప్‌, ఆయన పలికే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నాగార్జున, చైతూలను ఒకేసారి, ఒకేతెరపై చూడడం అభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తుంద’’ని చిత్రబృందం తెలిపింది. చలపతిరావు, రావు రమేష్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్ర్కీన్‌ ప్లే: సత్యానంద్‌, కెమెరా: యువరాజ్‌. 


Advertisement