బుద్దుని బోధ: మీరు ఇది లేదు.. అది లేదు అని నిరాశపడుతున్నారా? అయితే ఈ బిచ్చగాడికి చేసిన బోధ మీకూ వర్తిస్తుంది!

ABN , First Publish Date - 2021-11-20T13:23:24+05:30 IST

ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు.

బుద్దుని బోధ: మీరు ఇది లేదు.. అది లేదు అని నిరాశపడుతున్నారా? అయితే ఈ బిచ్చగాడికి చేసిన బోధ మీకూ వర్తిస్తుంది!

ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. సమీప గ్రామాల నుండి చాలా మంది ప్రజలు తమ సమస్యలకు పరిష్కారాలు చూపించాలని కోరుతూ బుద్ధుని వద్దకు వస్తున్నారు. వారి సమస్యలకు బుద్దుడు పరిష్కారం అందిస్తున్నాడు. దీంతో అందరూ ఆనందంగా అక్కడి నుంచి తిరిగి వెళుతున్నారు. అక్కడికి కొంతదూరంలో కూర్చున్న బిచ్చగాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ.. బుద్ధుని దగ్గరకు వెళ్తున్న వారిని చూసి.. ఇలా ఆలోచించసాగాడు.. ఇంతకుముందు వీరంతా విచారంలో కుంగిపోయినట్టు, తమ ముఖాలను వేలాడదీసుకుని, ఆ మహాత్ముని వద్దకు వెళుతున్నారు.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇంత సంతోషంగా ఎలా వస్తున్నారు? అక్కడ ఏమి జరుగుతోంది? అని అనుకున్నాడు. 


ఆ మహాత్ముడు ఇంతమందికి ఏ నిధిని పంచుతున్నాడో వెళ్లి చూస్తే బాగుండునని అనుకున్నాడు. వెంటనే ఆ బిచ్చగాడు బుద్దుని దగ్గరకు వెళ్లాడు. ఆ మహాత్ముడు వివిధ ప్రవచనాలు చేస్తూ, ప్రజల బాధలను తీర్చడాన్ని గమనించాడు. దీంతో తానూ ఆ మహాత్ముకి తన బాధలను చెప్పుకుని, తన దుఃఖానికి పరిష్కారం తెలుసుకోవాలనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్లి, తన రెండు చేతులు జోడించి, నమస్కరిస్తూ ఇలా అన్నాడు... ఓ మహాశయా.. నేను ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను. కానీ వారికి ఎలా సహాయం చేయగలను? నేను చాలా పేదవాడిని... నా దగ్గర ఎవరికైనా సాయం చేయడానికి డబ్బు లేదు. నేను చేయాలనుకున్నా ఎవరికీ సహాయం చేయలేకపోతున్నాను. భగవంతుడు నన్ను ఎందుకు ఇంత దరిద్రంలో ఉంచాడు?... ఈ సమస్య నుంచి బయటపడేందుకు పరిష్కారం చూపాలని కోరుతూ బిచ్చగాడు రోదించడం ప్రారంభించాడు. వెంటనే బుద్ధుడు ఆ బిచ్చగానితో.. నువ్వు నీదగ్గర ఏమీ లేదనే భ్రమలో బతుకుతున్నావు. ఇతరులకు ఇవ్వడానికి నీ దగ్గర చాలా ఉన్నాయి. డబ్బు, వస్తువులతో సంబంధం లేకుండా కూడా ఇతరులకు సహాయం చేయవచ్చని అన్నాడు. నీకు నాలుక ఉంది. దీని ద్వారా అందరితో నువ్వు మధురమైన మాటలు మాట్లాడవచ్చు. ఈ విధంగా నువ్వు ఇతరుల విచారకరమైన ముఖంలో చిరునవ్వును తీసుకురావచ్చు. నీ మంచి మాటలతో వారి మనస్సులో సానుకూల ఆలోచనలను నాటడం ద్వారా వారు తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆపవచ్చు. నీకు రెండు చేతులు ఉన్నాయి, వాటితో నువ్వు నిస్సహాయులకు సహాయం చేయవచ్చు.


గుడ్డివారికి మార్గాన్ని చూపేందుకు నీకు రెండు కళ్లు ఉన్నాయి. అలాగే నువ్వు ఒకరి మంచికోరి ప్రార్థించవచ్చు. నీ ప్రార్థనలతో వారికి మంచి జరుగుతుంది. ఇంతవరకూ నీలో ఉన్న అజ్ఞానం కారణంగా దీనిని అర్థం చేసుకోలేకపోయావు. ఎవరికీ సహాయం చేయడానికి ఏమీ లేదనే భ్రమలో జీవిస్తున్నావు. ఎవరికైనా సహాయం చేయడానికి డబ్బు, వస్తువులు మాత్రమే అవసరం లేదు. ఇవి లేకుండా కూడా మనం తోటివారికి అనేక విధాలుగా సహాయం చేయవచ్చు అని బుద్ధుడు ఆ బిచ్చగానికి అవగాహన కల్పించాడు. వివేకంతో నిండిన బుద్ధుని మాటలు విన్న ఆ బిచ్చగాడి ముఖంలో సంతృప్తి కనిపించింది. ఈ కథ ద్వారా బుద్దుడు.. నా దగ్గర ఇది లేదు, లేదు.. అని బాధపడే వారికి.. సంతృప్తిని మించిన పరిమౌషధం లేదని తెలియజేశాడు. సాయం చేయాలనే ఆలోచన ఉంటే మాటలతో కూడా చేయవచ్చని తెలియజేశాడు.

Updated Date - 2021-11-20T13:23:24+05:30 IST