బ్లాక్‌హెడ్స్‌ ఉన్నాయా!

ABN , First Publish Date - 2020-11-28T06:07:48+05:30 IST

చర్మరంధ్రాలు మూసుకుపోవడం, బ్లాక్‌హెడ్స్‌ వంటివి చర్మ కాంతిని తగ్గిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గ్రీన్‌ టీ, తేనె ఫేస్‌ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణురాలు గీతికా మిట్టల్‌ గుప్తా

బ్లాక్‌హెడ్స్‌ ఉన్నాయా!

చర్మరంధ్రాలు మూసుకుపోవడం, బ్లాక్‌హెడ్స్‌ వంటివి చర్మ కాంతిని తగ్గిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గ్రీన్‌ టీ, తేనె ఫేస్‌ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణురాలు గీతికా మిట్టల్‌ గుప్తా.  


ముందుగా ఒక చిన్న గిన్నెలో గ్రీన్‌ టీ పొడి తీసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా తేనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి నెమ్మదిగా వలయాకారంలో రుద్దుకోవాలి. ఆరిన తరువాత తేలికైన లోషన్‌ రాసుకోవాలి. 


ఈ ఫేస్‌ప్యాక్‌ మృతకణాలను తొలగిస్తుంది. చర్మరంధ్రాలు తెరచుకునేలా చేసి, నిగారింపును తెస్తుంది. ముఖం మీది ఎర్రటి మచ్చలను మాయం చేస్తుంది. సత్వర ఫలితం కోసం ఈ ఫేస్‌మాస్క్‌ ఎంచుకోవచ్చు. 

Updated Date - 2020-11-28T06:07:48+05:30 IST