Advertisement
Advertisement
Abn logo
Advertisement

మధ్యాహ్న భోజన బిల్లులు అందేనా?

- పెరిగిన కూరగాయలు, పప్పుల ధరలతో నిర్వాహకుల అవస్థలు
- నెలనెలా వేతనాలు రాక ఇబ్బందులు
- అప్పులు చేసి వండిపెడుతున్న వైనం
- పట్టించుకోని అధికారులు

బెల్లంపల్లి, నవంబరు 28: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని  మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు  నెలనెలా బిల్లులు రాకపోకవడంతో అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఆరు నెలలుగా  ఏజెన్సీలకు బిల్లులు అందడం లేదు. మరో వైపు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు  రోజు రోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు అప్పు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. పలు పాఠశాలల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.


- జిల్లాలో అమలవుతున్న తీరు...
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 750 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 46 వేల మంది విద్యార్థులు విద్యన భ్యసిస్తున్నారు. వీరందరికి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి స్లాబ్‌ రేటు ప్రకారం బిల్లులు చెల్లిస్తోంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ. 4.97, 6 నుంచి 8వ తరగతి విద్యార్థికి రూ. 7.45, 9 నుంచి 10 తరగతి విద్యా ర్థికి రూ. 9.45 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. మధ్యాహ్న భోజనం నిర్వాహ కులకు ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. కూరగాయలు, పప్పులు, వంట నూనె, గ్యాస్‌తో ఇతర వంట సామగ్రి ఏజెన్సీ నిర్వాహకులే సమకూర్చుకోవాలి. వీరికి సకాలంలో బిల్లులు అందకపోవడంతో నానా ఇబ్బం దులు పడుతున్నారు. కిరాణ దుకాణాల్లో అప్పులు పేరుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

- అందని బిల్లులతో లోపిస్తున్న  నాణ్యత
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు ప్రభు త్వం నెలనెలా బిల్లులు అందించకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో భోజనం తయారీలో నాణ్యత లోపి స్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లు లు చెల్లించాలని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ప్రస్తుతం సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యం లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ప్రభుత్వం చెల్లిస్తున్న వాటికి సరిపో వడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.  మెనూ ప్రకారం వారంలో మూడు సార్లు కోడిగుడ్లను అందించాలి. ప్రస్తుతం కోడిగుడ్ల ధరలకు రెక్కలు రావ డంతో ఏజెన్సీల నిర్వాహకులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఒక కోడిగుడ్డుకు రూ. 4 చెల్లిస్తుంది. కాగా మార్కెట్‌లో రూ. 6 పలుకుతుంది. అలాగే కూరగాయల ధరలు చుక్కలనంటాయి.  పది రోజుల వ్యవధిలో టమాట కిలో రూ. 100కు చేరింది. ఓ వైపు మధ్యాహ్న భోజన బిల్లులు రాకపోవడం, అదే విధంగా వంట వండేవారికి వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


 అప్పు చేసి భోజనం పెడుతున్నాం
 - సీహెచ్‌ వాణి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు , టేకులబస్తీ

ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు అందించకపోవడం తో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. మిగితా సరకులు కిరాణా షాపుల్లో కొనుగోలు చేస్తూ అప్పుల పాలువుతున్నాం. ప్రభుత్వం ఒక కోడిగుడ్డుకు రూ. 4 ఇస్తుంది. బయట రూ. 6 ధర ఉంది. కూరగాయలు ధరలు పెరగడంతో మరింత ఇబ్బందులు పడుతున్నాం. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు.  భోజనం వండే వారికి రూ.వెయ్యి అందడం లేదు. ప్రభుత్వం కోడిగుడ్ల తోపాటు వంట సరుకులను  సరఫరా చేయాలి.

మధ్యాహ్న భోజన బిల్లులు అందిస్తాం..
 -వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి

మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లుల విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటాం. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ఎంఈవోలు నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థు లకు అందేలా చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement