ఆర్డీటీ ఔదార్యం

ABN , First Publish Date - 2020-06-07T07:10:32+05:30 IST

లాక్‌డౌన్‌తో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందు లు పడుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు రవాణా, భత్యం చెల్లించేందుకు ఆర్డీటీ ముందుకొచ్చింది.

ఆర్డీటీ ఔదార్యం

వలస కార్మికుల  రవాణా చార్జీల చెల్లింపునకు ఓకే..


అనంతపురం  క్లాక్‌టవర్‌, జూన్‌ 6: లాక్‌డౌన్‌తో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందు లు పడుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు రవాణా, భత్యం చెల్లించేందుకు ఆర్డీటీ ముందుకొచ్చింది. లాక్‌డౌన్‌తో స్థానిక ఆదిమూర్తినగర్‌లోని ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహ సముదాయంలో ఆశ్రయం పొందుతున్న జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన 150మందికి పైగా వలస కార్మికులకు రూ.3 లక్షలకుపైగా రవాణా, భత్యం చెల్లిస్తామని ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌, ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌, హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాలాఫెర్రర్‌ తెలిపారు.


150 మంది వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా, భత్యం ఇవ్వాలని సంక్షేమ శాఖల అధికారులు, సాయిసంస్థ అధ్యక్షుడు విజయసాయికుమార్‌ ఆర్డీటీ దృష్టికి తీసుకెళ్లగా ఈనెల 9న వెళ్లేందుకు రైలు రిజర్వేషన్‌ చేయించారు. శనివా రం వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న వలస కార్మికుల వివరాలను ఆర్డీటీ అధికారులు రఫీక్‌, నాగప్ప, శ్రీనివాసులు, వన్నూరప్ప, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి సతీష్‌, వార్డెన్లు రాజేశ్వరి, మేరీవసంత నమోదు చేశారు.

Updated Date - 2020-06-07T07:10:32+05:30 IST