Abn logo
Jul 25 2021 @ 00:27AM

రావికమతంలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు

డిపోలో సరకు నిల్వలను తనిఖీ చేస్తున్న ఆర్డీవో

ఇద్దరు రేషన్‌ డీలర్లపై కేసులు


రావికమతం, జూలై 24: మండల కేంద్రంలోని రెండు రేషన్‌ డిపోలను నర్సీపట్నం ఆర్డీవో అనిత శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రావికమతం-1 డిపోలో 450 కిలోల బియ్యం, 23 ప్యాకెట్ల పంచదార అధికంగా ఉన్నందున డీలర్‌ ఆర్‌.మోదయ్యపై 6ఎ కేసు నమోదు చేశారు. అలాగే రెండో నంబర్‌ డిపో తనిఖీ సమయంలో డీలర్‌ గైర్హాజరు కావడంతో పాటు ఈ-పోస్‌ మిషన్‌ కూడా అందుబాటులో లేనందున డిపోను సీజ్‌ చేశారు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆర్డివో అనిత తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌వో ఆర్‌.సత్యనారాయణరాజు, సీఎస్‌డీటీ నాగమ్మ, ఆర్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.