‘అర్జున’కు అరుణ, సుమిత్‌

ABN , First Publish Date - 2020-06-04T09:17:36+05:30 IST

ప్రముఖ జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి బుద్దా అరుణా రెడ్డి, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఆటగాడు సుమిత్‌ రెడ్డి పేర్లను తెలంగాణ సర్కార్‌ అర్జున ...

‘అర్జున’కు అరుణ, సుమిత్‌

‘ధ్యాన్‌చంద్‌’ అవార్డుకు ఆర్చరీ కోచ్‌ ప్రణీత

సిఫారసు చేసిన తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రముఖ జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి బుద్దా అరుణా రెడ్డి, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఆటగాడు సుమిత్‌ రెడ్డి పేర్లను తెలంగాణ సర్కార్‌ అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. అరుణ 2018లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్‌ వరల్డ్‌క్‌పలో వాల్ట్‌ విభాగంలో కాంస్య పతకం సాధించి సంచలనం సృష్టించగా, సుమిత్‌ పలు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టాడు. వీరితో పాటు టెన్నిస్‌ కోచ్‌ సీవీ నాగరాజ్‌, దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ కోచ్‌ నీతను ద్రోణాచార్య అవార్డుకు, ఆర్చరీ కోచ్‌ వర్ధినేని ప్రణిత (వరంగల్‌)ను ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగా.. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు ప్రతిపాదించినట్లు జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధికారికంగా ప్రకటించింది. అలాగే స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌, మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ పీయూ చిత్ర, ట్రిపుల్‌ జంపర్‌ అర్పిందర్‌ సింగ్‌, 800 మీటర్ల రేసర్‌ మన్‌జీత్‌ సింగ్‌ పేర్లను అర్జున అవార్డుకు సిఫారసు చేసినట్టు ఏఎ్‌ఫఐ వెల్లడించింది. 


Updated Date - 2020-06-04T09:17:36+05:30 IST