యథేచ్చగా మట్టి తరలింపు

ABN , First Publish Date - 2021-07-31T04:52:08+05:30 IST

మండల పరిధిలోని యల్లారెడ్డిపల్లె గ్రామ సమీపంలో సర్వే నంబరు 569 ప్రభుత్వ భూమిలో కొందరు ఎర్రమట్టిని తరలిస్తున్నట్లు తెలి సింది. ఎలాంటి అనుమతులు లేకుండా నెల రోజుల నుంచి జేసీబీలతో, ట్రాక్టర్లతో మట్టిని నింపి తరలిస్తున్నారని, ట్రాక్టర్‌ మట్టి రూ.200 చొప్పున అమ్ముకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

యథేచ్చగా మట్టి తరలింపు
ట్రాక్టర్‌లో మట్టిని తరలిస్తున్న దృశ్యం

ప్రభుత్వ భూమిపై కన్ను

టిప్పు రూ.200తో విక్రయం

ఇదీ యల్లారెడ్డిపల్లె భూముల్లోని దుస్థితి

కమలాపురం(రూరల్‌), జూలై 30: మండల పరిధిలోని యల్లారెడ్డిపల్లె గ్రామ సమీపంలో సర్వే నంబరు 569 ప్రభుత్వ భూమిలో కొందరు ఎర్రమట్టిని తరలిస్తున్నట్లు తెలి సింది. ఎలాంటి అనుమతులు లేకుండా నెల రోజుల నుంచి జేసీబీలతో, ట్రాక్టర్లతో మట్టిని నింపి తరలిస్తున్నారని, ట్రాక్టర్‌ మట్టి రూ.200 చొప్పున అమ్ముకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మట్టి తరలిస్తుండగా గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ భూమి 16 ఎకరాల వరకు ఉంటుందని, టిప్పు రూ.200 చొప్పున అమ్ముకున్నా దాదాపు ఒక ఎకరా రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ మట్టిని ఆకుతోటలకు, చౌడు భూముల్లో సత్తువ ఇచ్చేందుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి మట్టి తరలింపును ఆపాలని లేదంటే చుట్టుపక్కల గ్రామాల రైతుల పశువులను మేపుకునేందుకు స్థలం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దారు వియకుమార్‌ను వివరణ కోరగా మట్టి తోలేందుకు ఎలాంటి అనుమతులు లేవని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే అక్కడికి తమ సిబ్బందిని పంపించి అది ప్రభుత్వ స్థలమని బోర్డు నాటిస్తామని తెలిపారు. 


ప్రభుత్వ భూమిని రక్షించాలి

ఈ ప్రాంతంలో ఎకరా రూ.10 లక్షలు ఉంటుందని, భూమిని రక్షించాలని పలువురు కోరుతు న్నారు. తాము నిలదీస్తే ఈ మట్టి సచివాలయానికి తరలిస్తున్నామని చెబుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి మట్టి తవ్వకాలను అరికట్టాలని ఆ గ్రామానికి చెందిన కొంతమంది అధికారులకు విన్నవించుకుంటున్నారు.  

Updated Date - 2021-07-31T04:52:08+05:30 IST