యథేచ్ఛగా అక్రమ రవాణా, కట్టడాలు

ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST

రంగసముద్రం పంచాయతీలో అక్రమార్కులకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఆదివారం అయితే చాలు.. అధికారులు ఉండరని యథేచ్ఛగా ఒకవైపు మట్టి అక్రమ తవ్వకాలు, మరోవైపు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల పక్కనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ అఽఽధికారుల దృష్టికి వెళ్లినా బడా నాయకుల చేత ఫోన్లు వెళుతుండడంతో వారు చూసీచూడనట్టు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి.

యథేచ్ఛగా అక్రమ రవాణా, కట్టడాలు
రంగసముద్రం పంచాయతీలో యంత్రాలతో ట్రాక్టర్లకు మట్టిని పోస్తున్న దృశ్యం

ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు బేఖాతరు

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు 

ఆదివారాన్ని అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులు

పోరుమామిళ్ల, జనవరి 23: రంగసముద్రం పంచాయతీలో అక్రమార్కులకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఆదివారం అయితే చాలు.. అధికారులు ఉండరని యథేచ్ఛగా ఒకవైపు మట్టి అక్రమ తవ్వకాలు, మరోవైపు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల పక్కనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ అఽఽధికారుల దృష్టికి వెళ్లినా బడా నాయకుల చేత ఫోన్లు వెళుతుండడంతో వారు చూసీచూడనట్టు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. 

రంగసముద్రం పంచాయతీ తిప్ప సమీపంలో ఉన్న స్థలాన్ని యంత్రాలతో తవ్వుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేసుకున్న వెంచర్లకు మట్టిని తోలుకుంటున్నారు. గుట్టలు తవ్వాలంటే మైనింగ్‌ అధికారుల, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. కాని కొందరు వాటిని లెక్కచేయకుండా యథేచ్ఛగా యంత్రాలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అలాగే రంగసముద్రం పంచాయతీ పరిధిలోని 1273 సర్వే నెంబర్‌లో ఇటీవల రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డుకు సమీపంలోనే నిర్మాణాలు జరుగున్నాయి. వీఆర్యేలు కొందరు వాటిని అడ్డుకోగా నిర్మాణాలు చేస్తున్న వారు తమ నాయకుని వద్ద పత్రాలు ఉన్నాయని, ఆయన తరువాత తెచ్చి చూపిస్తారని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ స్థలాలకు, గుట్టలకు రక్షణ ఉంటుంది. లేకపోతే అక్రమార్కులపాలు కావాల్సిందే. ఈ విషయమై తహసీల్దార్‌ విజయకుమారిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా తమ సిబ్బందిని పంపామని అక్రమ నిర్మాణాలు అడ్డుకుంటామని అన్నారు. మట్టి అక్రమంగా తరలించే వాహనాలను నిలుపుదల చేస్తామని చెప్పారు.




Updated Date - 2022-01-23T05:30:00+05:30 IST