రాష్ట్రంలో ఏకపక్ష పాలన

ABN , First Publish Date - 2021-01-24T06:39:56+05:30 IST

రాష్ట్రంలో ఏకపక్ష పాలన సాగుతోందని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలుపే ధ్యేయంగా పనిచేయాలంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు

రాష్ట్రంలో ఏకపక్ష పాలన

- స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం 

- మాజీ మంత్రి పల్లె 

ఓబుళదేవరచెరువు, జనవరి 23: రాష్ట్రంలో ఏకపక్ష పాలన సాగుతోందని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలుపే ధ్యేయంగా పనిచేయాలంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన పంచాయతీ ఎన్నికలు ప్రకటిస్తే ఓటమి భయంతో రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చూపుతూ అడ్డుకోవడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఉంటే ఏకగ్రీవాలు చేసుకోవడానికి వీలుపడదని ఎన్నికలు అడ్డుకుంటున్నారన్నారు. ధమ్ము , ధైర్యం ఉంటే ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో  మండల పార్టీ కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర,  మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు అల్లాబకష్‌, మాజీ కోఆప్షన సభ్యులు నిజాం, తెలుగుయువత నాయకులు బూదిలి ఓబుళరెడ్డి, గంటా శ్రీనివాసులు, ఆరీ్‌ఫఖాన, మాజీ కన్వీనర్‌ శంకర్‌నాయుడు, రామానాయుడు, రాజారెడ్డి, సుధాకర్‌, కంచి సురేష్‌, చెండ్రాయుడు, ఆం జనేయులు, ప్రసాద్‌, కుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, అబ్లు, డ్రిప్పు నాగరాజు, శ్రీనివాసు లు, మల్లి, అంజి, మాబు, నల్లపరెడ్డి, గంగాద్రి, చండ్రాయుడు, పీట్ల సుధాకర్‌, మాబు, అంజి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-24T06:39:56+05:30 IST