యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

ABN , First Publish Date - 2022-07-04T05:00:09+05:30 IST

మండలంలోని ప్రభుత్వ భూ ములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు.

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి

సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు

65 ఎకరాలు కబ్జాకు గురైనట్లు 

గుర్తించిన అధికారులు

11 మందిపై కేసు 

తర్లుపాడు, జూలై 3 : మండలంలోని ప్రభుత్వ భూ ములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. మండలంలోని కలుజువ్వలపాడు ఇలాకాలో టీడీపీ హయాంలో ఏపీ ఐఐసీకి సర్వేనెం-36-2లో 48.66 సెంట్లు, 41-1లో 14.35 సెంట్లు, 42-1లో 7.41, 55-2లో 50.15 సెంట్లు మొత్తం 120 ఎకరాల 62 సెంట్ల భూమిని కేటాయించారు. ఈ భూమిలో పరిశ్రమలు నిర్మిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని గత ప్రభుత్వం నిర్ణయిం చింది. వైసీపీ అధికారంలోకి  వచ్చాక ఆ భూములను ప ట్టించుకోలేదు. దీంతో ఆ భూములపై అధికార పార్టీ నా యకుల కన్ను పడింది. ఈ ప్రభుత్వ భూములన్నీ మే కలవారిపల్లె టోల్‌ ప్లాజాకు సమీపంలో ఉండడంతో ధర లకు రెక్కలొచ్చాయి. ఎకరా దాదాపు రూ.కోటి పలుకు తోంది. ఈ భూములను ఎలాగైనా దక్కించు కోవాలని అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ఆక్రమిస్తూ ఏకంగా కంచె రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మరికొంద రు ఏకంగా పంటలను సాగు చేస్తున్నారు.  2 రోజుల నుంచి రెవెన్యూ అధికారులు 36-2, 41-1, 42-1, 55-2లో ఉన్న 120 ఎకరాల ప్రభుత్వ భూ ములను సర్వే చేశారు. వాటిలో సుమా రు 65 ఎకరాలు భూమి ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. 

11 మందిపై కేసు 

కలుజువ్వలపాడు ఇలాకాలో 36-2, 41-1, 42-1, 55-2  సర్వే నెంబర్లలో సు మారు 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిలో 65 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసినట్లు రెవె న్యూ అధికారులు గుర్తించారు. ఇన్‌ చార్జి తహసీల్దార్‌ బి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు  వీఆర్వో కె.ప్రకాష్‌రావు తాడివారిపల్లె పోలీస్‌ స్టేషన్‌లో 11 మంది ఆక్రమణదారులపై ఫిర్యాదు చేశారు.  వీఆర్వో ఫిర్యాదు మేరకు కందుల వెంకట సుబ్బారెడ్డి, మండ్ల సుబ్బారెడ్డి, మండ్ల వెంకటేశ్వరరెడ్డి, మేకల వెంకటకొండారెడ్డి, బి.వెం కటనారాయణ, ఎం.భాస్కర్‌రెడ్డి, ఎం.వెంకట కొండారెడ్డి, టి.వెంకటేశ్వరరెడ్డి, ఎం.వెంకటరెడ్డి, బి.వెంకటరెడ్డి, ఎం.బ్ర హ్మారెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ముక్కంటి తెలిపారు. 


Updated Date - 2022-07-04T05:00:09+05:30 IST