దళితుల పెళ్లి ఊరేగింపుపై రాళ్లదాడి: 9 మంది అరెస్టు!

ABN , First Publish Date - 2021-02-25T12:16:33+05:30 IST

గుజరాత్‌లోని అరావలీలో కొందమంది దళితులు పెళ్లి ఊరేగింపు...

దళితుల పెళ్లి ఊరేగింపుపై రాళ్లదాడి: 9 మంది అరెస్టు!

అరావలీ: గుజరాత్‌లోని అరావలీలో కొందమంది దళితులు పెళ్లి ఊరేగింపు నిర్వహిస్తుండగా వారిపై అగ్రవర్ణాలకు చెందిన కొందమంది రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9మందిని అరెస్టు చేశారు. దళితులు పెళ్లి ఊరేగింపులో పాల్గొని, గర్బా నృత్యం చేస్తుండగా అగ్రవర్ణాలవారు వారిపై దాడి చేశారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-02-25T12:16:33+05:30 IST