Abn logo
May 16 2020 @ 11:40AM

ఆహా కోసం అర‌వింద్ ప్ర‌య‌త్నాలు

తెలుగు తొలి ఓటీటీ ఛానెల్ ఆహా. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆహాను ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ఓటీటీలో ఫ్లాట్‌ఫామ్‌లో క్రిష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటివారు తమ వంతు పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే ఇంకా బెట‌ర్ కంటెంట్ కోసం అర‌వింద్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని సినీ వ‌ర్గాలంటున్నాయి. అందులో భాగంగా వంశీపైడిప‌ల్లి, నందినీరెడ్డి, చంద్ర‌సిద్ధార్థ్‌, వి.ఎన్‌.ఆదిత్య వంటి ద‌ర్శ‌కుల‌ను కంటెంట్ క‌న‌స‌ల్‌టెంట్స్‌గా నియ‌మించుకున్నారు. వీరిప్పుడు కొత్త టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసే ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement