పంజాబ్ పాఠశాలల అభివృద్ధికి మద్దతివ్వండి : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-12T21:33:06+05:30 IST

పంజాబ్‌లోని పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందని

పంజాబ్ పాఠశాలల అభివృద్ధికి మద్దతివ్వండి : కేజ్రీవాల్

చండీగఢ్ : పంజాబ్‌లోని పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందని, తమ పార్టీ అధికారం చేపడితే, వాటిని మెరుగుపరుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పాఠశాలల అభివృద్ధి కోసం తమకు మద్దతివ్వాలని ఆ రాష్ట్ర ప్రజలను ఓ వీడియో సందేశం ద్వారా కోరారు. 


పంజాబ్‌లో విద్యా రంగం బాగులేదని, ప్రభుత్వ పాఠశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు లేవన్నారు. రాష్ట్రంలోని టీచర్లు చాలా మందివారేనని, అయితే వారంతా విచారంతో ఉన్నారని తెలిపారు. 24 లక్షల మంది విద్యార్థులు పేదలు, దళితులు, ఎస్సీలని చెప్పారు. ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ఇటీవలే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. 


Updated Date - 2021-12-12T21:33:06+05:30 IST