అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్న కేజ్రీవాల్.. లాక్‌డౌన్ విధించే ఛాన్స్

ABN , First Publish Date - 2021-04-17T16:48:47+05:30 IST

రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని

అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్న కేజ్రీవాల్.. లాక్‌డౌన్ విధించే ఛాన్స్

న్యూఢిల్లీ : రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కోవిడ్ నోడల్ మంత్రి, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారులందరూ హాజరుకానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కోవిడ్‌ను కట్టడి చేయడానికి ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా వీకెండ్ కర్ఫ్యూ కూడా విధించారు. ఆ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 నుంచే అమలులో ఉంది. అయితే ఇంత చేసినా, కోవిడ్ కేసులు తగ్గకపోతే మాత్రం లాక్‌డౌన్ విధించే దిశగానే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు.


అయితే కోవిడ్ నియంత్రణకు లాక్‌డౌన్ ఎంత మాత్రమూ పరిష్కారం కాదని కేజ్రీవాల్ ఇప్పటికే రెండు సార్లు ప్రకటించారు. అయితే కేసులు పెరుగుతున్న వేళ వేరే గత్యంతంర లేదని కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వీకెండ్ కర్ఫ్యూ ప్రారంభమైన నేపథ్యంలో కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ‘‘కరోనా నేపథ్యంలో శనివారం, ఆదివారం కర్ఫ్యూ అమలులో ఉంది. అందరూ దీనిని పాటించాలని కోరుతున్నాము. మనమందరమూ కలిసి కరోనాను జయిద్దాం’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-04-17T16:48:47+05:30 IST