అరటికాయ బజ్జీ

ABN , First Publish Date - 2021-05-28T14:29:15+05:30 IST

అరటికాయలు- రెండు, శెనగపిండి- కప్పు, బియ్యం పిండి- రెండు కప్పులు, కారం పొడి- స్పూను, ఇంగువ- చిటికెడు, వాము- కొంచెం, నూనె, ఉప్పు- తగినంత.

అరటికాయ బజ్జీ

కావలసిన పదార్థాలు: అరటికాయలు- రెండు, శెనగపిండి- కప్పు, బియ్యం పిండి- రెండు కప్పులు, కారం పొడి- స్పూను, ఇంగువ- చిటికెడు, వాము- కొంచెం, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: అరటికాయ కొనల్ని కత్తిరించి చెక్కుతీసి పొడవాటి ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఈ ముక్కల్ని నీళ్లలో కాసేపు నానబెట్టాలి. ఓ గిన్నెలో శెనగ, బియ్యం పిండి, కారం పొడి, పసుపు, వాము, ఇంగువ, తగినంత నీళ్లు పోసి ఓ మోస్తరు జారుగా కలుపుకోవాలి. అరటి ముక్కల్ని నీటి నుండి తీసి ఓ ఎండు గుడ్డతో పొడిగా తుడచాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక ఒక్కో అరటి ముక్కని శెనగ పిండి మిశ్రమంలో అద్ది నూనెలో వేయిస్తే అరటికాయ బజ్జీ తయారు.

Updated Date - 2021-05-28T14:29:15+05:30 IST