Abn logo
May 20 2020 @ 18:45PM

ఓటీటీలో రానా త్రిభాషా చిత్రం

లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టంతో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడు విడుదల కావాలంటే రిలీజ్ డేట్స్ విష‌యంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. దీంతో నిర్మాత‌లు సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుల‌య్యాయి. ఆ కోవ‌లో రానా త్రిభాషా చిత్రం ‘అర‌ణ్య’ కూడా చేరనుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రానా టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘అర‌ణ్య‌’. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను ఏప్రిల్‌2న‌ విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. క‌రోనా ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో సినిమా విడుద‌ల ఆగింది. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement