43వ కైరో ఫెస్టివల్‌లో రెహమాన్‌కు అరుదైన గౌరవం!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌. తెలుగు, తమిళ,  మలయాళ, హిందీ, హాలీవుడ్‌ చిత్రాలకు సంగీతం అందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆస్కార్‌ను అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గాను 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఐఎఫ్‌ఎఫ్‌)లో అరుదైన గౌరవం దక్కింది. సంగీతం, సినిమాకు ఆయన అందించిన సేవలకుగానూ సిఐఎఫ్‌ఎఫ్‌ ఆయన్ను సత్కరించి ప్రశంస పత్రం అందజేసింది. ఆ మేరకు రెహహాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫొటోలు షేర్‌ చేసి  సిఐఎఫ్‌ఎఫ్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. Advertisement