Apr 13 2021 @ 15:18PM

ఎ.ఆర్‌.మురుగదాస్‌ పాన్‌ ఇండియా మూవీ.. '1947'

స్టార్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ కంటెంట్ సినిమాలను నిర్మించే మురుగుదాస్‌ త్వరలోనే మరో సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. '1947' పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను పొన్‌ కుమరన్‌ తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను మురుగుదాస్‌తో కలిసి బాలీవుడ్‌ నిర్మాత ఓం ప్రకాష్‌ భట్‌ నిర్మించనున్నారు. '1947' టైటిల్‌ చూస్తుంటేనే స్వాతంత్ర్యానికి సంబంధించిన సినిమా అనే అర్థం వస్తుంది. కానీ మురుగుదాస్‌ అండ్‌ టీం ఏ విషయాన్ని చెప్పలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. రజినీకాంత్‌ 'దర్బార్‌' తర్వాత మురుగుదాస్‌ ఏ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నాడనే దానిపై క్లారిటీ లేదు.