స్విమ్మింగ్‌లో తెలంగాణకు 5 పతకాలు
ABN , First Publish Date - 2021-10-20T07:47:23+05:30 IST
జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ 5 పతకాలు కొల్లగొట్టింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ 5 పతకాలు కొల్లగొట్టింది. బెంగళూరులో జరుగుతున్న ఈ పోటీల్లో బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అనికా స్వర్ణం గెలుచుకోగా, బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో హైదరాబాదీ తేజస్ కుమార్ రజతంతో మెరిశాడు. బాలుర 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో యశస్వి, బాలికల 200 మీ. మెడ్లేలో నిత్య రజతాలతో మెరిశారు. ఇక, 4-200 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో లాస్య, మోక్షిత, సహస్ర, నిత్యతో కూడిన జట్టు రజతం పతకం నెగ్గింది.