కరోనా ఎఫెక్ట్ : ఆక్వా రైతుల విలవిల

ABN , First Publish Date - 2020-04-04T23:14:09+05:30 IST

జిల్లాలో రైతులను కరోనా కలవర పెడుతోంది. ధాన్యం, నిమ్మ, ఆక్వా ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు విలవిలలాడిపోతున్నారు. వ్యవసాయమే ప్రధాన

కరోనా ఎఫెక్ట్ : ఆక్వా రైతుల విలవిల

నెల్లూరు : జిల్లాలో రైతులను కరోనా కలవర పెడుతోంది. ధాన్యం, నిమ్మ, ఆక్వా ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు విలవిలలాడిపోతున్నారు. వ్యవసాయమే ప్రధాన భూమిక గల రైతులు చాలా దిగాలు పడిపోతున్నారు. నిమ్మకాయలను అమ్ముకోలేక చివరకు రోడ్లపై పారబోస్తున్నారంటే రైతుల పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఆక్వా రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.


డాలర్లు సంపాదించి, దేశంలో ప్రసిద్ధి చెందిన ఆక్వా డీలా పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తెలిపారు. అమెరికా, చైనాకు పంపిన సరుకును తీసుకోవడం లేదని, సముద్రం పైనే ఉత్పత్తులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. కరోనా తగ్గిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తామని ఆ దేశాలు స్పష్టం చేస్తున్నారని నారాయణ రెడ్డి తెలిపారు. ఆక్వా రంగం కుదేలుపై బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ.... 

Updated Date - 2020-04-04T23:14:09+05:30 IST