ఆప్తులకే ఆహ్వానం

బాలీవుడ్‌ ప్రేమ జంట కట్రినా కైఫ్‌, విక్కీ కౌషల్‌ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారనే  వార్తలు గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. అయితే ఈ వివాహం విషయమై ఇప్పటిదాకా కట్రీనా, విక్కీ మాత్రం పెదవి విప్పలేదు. అయితే వచ్చే వారం వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని సవాయి మాధాపూర్‌లోని రాజప్రాసాదంలో జరగనుందని సమాచారం. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో సంగీత్‌, మెహందీ, వివాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఎలాంటి హడావిడి లేకుండా ఆప్తుల సమక్షంలో ఒక్కటవనున్నారట విక్కీ, కట్రీనా. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే పెళ్లి పత్రికలు అందాయట. మొత్తం 120 మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.


Advertisement