సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రం : ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-10-20T06:13:12+05:30 IST

పీఆర్సీ అమ లు, సీపీఎస్‌ రద్దు, యాప్‌ల రద్దు వంటి సమస్యల ప రించాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరిస్తూ నవంబర్‌ 2న చలో విజయవాడ చేపడతామన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రం : ఏపీటీఎఫ్‌

విజయవాడ సిటీ, అక్టోబరు 19 : పీఆర్సీ అమ లు, సీపీఎస్‌ రద్దు, యాప్‌ల రద్దు వంటి సమస్యల ప రించాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరిస్తూ నవంబర్‌ 2న చలో విజయవాడ చేపడతామన్నారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలతో పాటుగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ధర్నా చేపట్టారు. స్థానిక ధర్నాచౌక్‌లో మొదటి రోజు ధర్నా మంగళవారం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాల ఐక్యవేదికలు స్పందించడం లేదన్నారు. సంఘ ప్రధానకార్యదర్శి పి.పాండురంగ ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 25వేల పోస్టులు ఖాళీగా ఉన్నా డీఎస్సీ ఇచ్చే పరిస్ధితి లేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నేతాంజనేయ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి,  మాజీ ప్రధానకార్యదర్శి ఎస్‌.పరమేశ్వరరావు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:13:12+05:30 IST