పాఠశాలల విలీనంతో విద్యారంగానికి తీరని నష్టం

ABN , First Publish Date - 2022-06-25T05:57:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయడం వల్ల విద్యారంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(1938) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాలల విలీనంతో విద్యారంగానికి తీరని నష్టం
మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి

గుంటూరు(విద్య), జూన్‌ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయడం వల్ల విద్యారంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(1938) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని  కార్యాయలంలో శుక్రవారం  నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోనం 117 వల్ల ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతులు అంగన్‌వాడీ స్కూల్స్‌లో కలిసిపోతాయని ఫలితంగా ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరసింహారావు మాట్లాడుతూ మున్సిపల్‌ విద్యను ప్రభుత్వంలోని తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. జిల్లా అధ్యక్షులు  జి.వేళాంగణిబాబు ప్రసంగిస్తూ ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు 62కు పెంచాలని కోరారు. రాష్ట్ర క్రమశిక్షణ  కమిటీ సభ్యులు జె.విజయానంద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు కైలాస్‌నాథ్‌, శ్రీరవి, మోపిదేవి శివశంకరరావు, గురజాల శ్రీనివాసరావు, జోజప్ప, గణేష్‌, చెంచయ్య, నాగార్జున, ఆలా సురేష్‌, మహిళా నాయకులు పవిత్ర, ఎలిజబెత్‌, ఆలియా తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-25T05:57:52+05:30 IST