2న ఛలో విజయవాడ

ABN , First Publish Date - 2021-10-29T05:22:15+05:30 IST

ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు తదితర అంశాల పరిష్కారం కోసం నవంబరు 2న ఛలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బసవలింగారావు, సయ్యద్‌చాంద్‌బాష తెలిపారు.

2న ఛలో విజయవాడ
పోస్టర్‌ ఆవిష్కస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

గుంటూరు(విద్య), అక్టోబరు 28: ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు తదితర అంశాల పరిష్కారం కోసం నవంబరు 2న ఛలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బసవలింగారావు, సయ్యద్‌చాంద్‌బాష తెలిపారు. గురువారం ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో పోస్టర్స్‌ ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి  వరకు విజయవాడలో నిర్వహించిన దీక్షలకు ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాగశివన్నారాయణ, రమేష్‌, జిల్లా కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ ఖాలీద్‌, మహ్మమద్‌ ఉస్మాన, ఎం బాలకుమార్‌, ప్రభాకర్‌, వందనం, సైమన, లక్ష్మయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-29T05:22:15+05:30 IST