Abn logo
Aug 4 2021 @ 00:39AM

ప్రాథమిక స్థాయి తరగతుల విభజన సరికాదు

ప్రాథమిక స్థాయి తరగతుల విభజన సరికాదు

పటమట, ఆగస్టు 3: ఎన్‌ఈపీ పేరుతో ప్రాథమిక స్థాయి విభజన సరికాదని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. శేషగిరి, తుమ్ము నాగరాజుల అన్నారు. మంగళవారం పటమటలోని డీఈవో క్యాం పు కార్యాలయంలో పలు సూచనలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా విద్యా శాఖాధి కారి తాహెరా సుల్తానాకు అందజేశారు. ప్రభుత్వం శాటిలైట్‌ ఫౌండేషన్‌, ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ఫ్లస్‌, ప్రీ హైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ఫ్లస్‌ అంటి ఆరు రకాల స్కూల్స్‌ ఏర్పాటు చేసే క్రమంలో ఫౌండేషన్‌ స్కూళ్ళకు అంగన్‌ వాడీలను ఏ విధంగా మెర్జ్‌ చేస్తున్నారో తెలపాలన్నారు. మొదటి స్థాయి ఫౌండేషన్‌ స్కూల్స్‌ ఏర్పాటు మీద చర్చ జరగాలని అధికారులను కోరారు.