19నుంచి దశలవారీ ఆందోళనకు సిద్ధం

ABN , First Publish Date - 2021-04-17T05:40:42+05:30 IST

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

19నుంచి దశలవారీ ఆందోళనకు సిద్ధం

ఏపీటీఎఫ్‌ నాయకులు

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 16: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19 నుంచి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల హామీల్లో ప్రకటించిన జగన్‌ ఇప్పుడు ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదన్నారు. పీఆర్‌సీ అమలు, డీఏ బకాయిలు చెల్లింపులో జరుగుతున్న జాప్యం కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని తెలపారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు మూడు నెలలు కావస్తున్నా జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 19న అన్ని మండల కేంద్రాల్లో ఎంఈవోలకు వినతి పత్రాలు అందిస్తామని, 26న జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు.

Updated Date - 2021-04-17T05:40:42+05:30 IST