మందలింపులు.. హెచ్చరికలతో మార్పు రాలేదని.. రోజా పూలిచ్చి..!

ABN , First Publish Date - 2021-10-26T12:20:41+05:30 IST

మందలింపులు.. హెచ్చరికలతో మార్పు రాలేదని

మందలింపులు.. హెచ్చరికలతో మార్పు రాలేదని.. రోజా పూలిచ్చి..!

తిరుపతి : మందలింపులు.. హెచ్చరికలతో డ్రైవర్లలో మార్పు రాలేదని భావించిన ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్యూటీ సమయంలో డ్రైవర్లకు ఒక రోజా అందజేసి డ్రైవింగ్‌ సమయంలో నియమాలను పాటించాలని కోరారు. ప్రమాద రహిత, కేఎంపీఎల్‌, సురక్షిప్రయాణం కల్పిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి తిరుపతిలోని సెంట్రల్‌బ్‌సస్టేషన్‌, అలిపిరి, మంగళం డిపోల పరిధిలో కొందరు డ్రైవర్లకు రోజాలు అంద జేశారు. 


జిల్లా వ్యాప్తంగా దాదాపు 7వేల మంది డ్రైవర్లు ఉన్నారు. తొలి రోజు డ్యూటీకి వచ్చిన డ్రైవర్లకు ఆయా డిపోల మేనేజర్లు రోజా పూవును అందించి జాగ్రత్తలు చెప్పారు. మిగిలిన వారికి మంగళ, బుధవారాల్లో అందించనున్నారు. తిరుపతి డిపో గ్యారేజ్‌ ఆవరణలో జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఆర్‌ఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథం, డీఎం ప్రవీణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పుష్పలత, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T12:20:41+05:30 IST