ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-22T06:13:46+05:30 IST

ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
పెదవుటపల్లి పీహెచ్‌సీలో ఆన్‌లైన్‌ విధానాన్ని పరిశీలిస్తున్న గీతాభాయి

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌(ఉంగుటూరు), మే 21 : ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ, ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండా లని, ఫీవర్‌ సర్వే, స్కూల్‌ హెల్త్‌ తదితర విష యాలను తెలియజెప్పాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి గీతాభాయి సిబ్బందికి సూచించారు. పెద అవుటపల్లి పీహెచ్‌సీలో శనివారం గీతా బాయి ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను తనిఖీ చేశారు. పీహెచ్‌సీ పరిధిలో ప్రస్తుతం అందిస్తున్న ఓపీ సేవలను మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. అవుట్‌ పేషెంట్స్‌ రికా ర్డును, ఇమ్యూనైజేషన్‌ రికార్డులను ఆన్‌లైన్‌ చేసే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్‌ఎల్‌పీలు, ఉపకేంద్రాల ద్వారా వైద్య సేవలు మెరుగుపర్చాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ప్రసవాలపై అవగాహన కల్పించి 100శాతం పురోగతి సాధించాలని సిబ్బందికి సూచించారు.   వైద్యాధికారి కరీం, డాక్టర్‌ అపర్ణ, ఎంపీ హెచ్‌ఓ శ్రీనివాసరావు, సాంబశివరాజు, పీహెచ్‌ ఎన్‌ ఫిల్మోనియా, కుమారి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:13:46+05:30 IST