ఏప్రిల్‌ నెలాఖరుకు.. ఖాళీ చేయాలి

ABN , First Publish Date - 2021-02-27T05:50:49+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మా ణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపునకు గురవుతున్న 25 గ్రామాలను ఏప్రిల్‌ నాటికి ఖాళీ చేయిం చేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

ఏప్రిల్‌ నెలాఖరుకు.. ఖాళీ చేయాలి

25 గ్రామాలకు ప్రభుత్వ ఆదేశాలు

కుక్కునూరు, ఫిబ్రవరి 26 : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మా ణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపునకు గురవుతున్న 25 గ్రామాలను ఏప్రిల్‌ నాటికి ఖాళీ చేయిం చేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. కుక్కునూరు మండలం 8, వేలేరుపాడు  మండలం 18 గ్రామాలు ముంపు జాబితాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరతిగతిన విచారణ జరిపించాలని ఐటీడీఏ పీవో సూర్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించ డానికి సంసిద్ధం చేయించాలని కార్యదర్శి, సర్పంచ్‌లను ఉత్తర్వుల్లో కోరారు. కుక్కునూరు మండలంలో కివ్వాక, కుక్కునూరు ఎ బ్లాక్‌, గుంపెనపల్లి, చీరవల్లి, భువనగిరి, దామరచర్ల, గొమ్ముగూడెం, రామచంద్రపురం గ్రామాలు తరలించే గ్రామాల జాబితాలో ఉన్నాయి. అలాగే వేలేరు పాడులో 17 గ్రామాలు ఉన్నాయి. ఏప్రిల్‌ నెలాఖరు కు 25 గ్రామాల తరలింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ డంతో శుక్రవారం మండలం అంతా చర్చనీయాంశమైంది. 


  ఏప్రిల్‌ నాటికి తరలిస్తాం : ఐటీడీఏ పీవో

41.15 కాంటూరు లెవెల్‌లో ముంపు గ్రామాల ప్రజలను ఏప్రిల్‌ నాటికి కాలనీలకు తరలించే ప్రక్రియ ఆరంభించాం. కుక్కునూరు మండల గిరిజనేతర కుటుంబాలకు జంగా రెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లావారి గూడెం వద్ద కాలనీల నిర్మాణం వేగంగా పూర్తిచేస్తున్నాం. గిరిజన కుటుంబాలను తరలించేందుకు కుక్కునూరులో పునరావాస కాలనీలు పూర్తి చేస్తున్నాం.

Updated Date - 2021-02-27T05:50:49+05:30 IST