అప్రికాట్ ఐస్‌క్రీం
ABN , First Publish Date - 2021-04-24T17:43:50+05:30 IST
అప్రికాట్లు - నాలుగు (ఎండినవి), పెరుగు - ఒక కప్పు, జున్ను - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - తగినంత.
కావలసినవి: అప్రికాట్లు - నాలుగు (ఎండినవి), పెరుగు - ఒక కప్పు, జున్ను - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - తగినంత.
తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి కొన్ని నీళ్లు పోసి అప్రికాట్లు వేసి 20 నిమిషాల పాటు చిన్నమంటపై మరిగించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో పెరుగు, జున్ను, నిమ్మరసం, తగినంత పంచదార వేసి బాగా కలియబెట్టాలి. మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి.