అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-22T06:38:27+05:30 IST

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి
చిన ఓగిరాలలో మాట్లాడుతున్న వైద్యాధికారి శ్వేత

కొవిడ్‌పై సమీక్షా సమావేశంలో అధికారులు 

ఉయ్యూరు, జనవరి 21 : కమ్ముకొస్తున్న కరోనాపై ప్రతి ఒక్కరూ అప్ర మత్తంగా ఉండాలని, ప్రజల్లో అవగాహన కల్పించి, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉయ్యూరు ఎంపీడీవో సునీతా శర్మ, తహసీల్దార్‌ కె.నాగేశ్వరరావు పలు శాఖల సిబ్బందికి సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో అధ్య క్షతన  మండల  కొవిడ్‌ -19 మండల కమి టీ  సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించే లా చూడాలని, షాపుల వద్ద  శానిటైజర్‌  ఏర్పాటు, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో జ్వరం సర్వే జరి పించి శానిటేషన్‌ చేయించాలని సూచిం చారు. కాటూరు, చిన ఓగిరాల  పీహెచ్‌సీల అధికారులు బేగం సబీహ, పి.శ్వేత, అనిల్‌ ఉయ్యూరు పట్టణ, రూరల్‌  పోలీస్‌స్టేషన్ల  ఎస్సైలు వీరప్రసాద్‌ , రమేష్‌ పాల్గొన్నారు. 

కంకిపాడు : కొవిడ్‌  నిబంధనలు తప్పక పాటించాలని  తహసీల్దార్‌ టీ.వీ.సతీష్‌ అన్నారు. కంకిపాడులో కిరాణా, బట్టల దుకాణ యజమానులతో శుక్రవారం సమా వేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. షాపుల వద్ద శానిటైజర్‌  ఉంచాలని,  సిబ్బం ది అందరూ తప్పక మాస్క్‌ ధరించేలా చూడాలని సూచించారు.   

ఉంగుటూరు : చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు అప్రమత్తంగా వుండాలని ఉంగుటూరు ఎంపీపీ పులపాక ప్రసన్నలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆత్కూరు జడ్పీహైస్కూల్‌ను స్ధానిక ఎంపీటీసీలు ఆర్నేపల్లి శివలక్ష్మి, సొంగా మేరీతో కలిసి సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో  సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎంపీపీ సూచించారు. 

Updated Date - 2022-01-22T06:38:27+05:30 IST