స్త్రీ, శిశు సంక్షేమశాఖలో 22 పోస్టులు
అమరావతి: స్త్రీ, శిశుసంక్షేమ అభివృద్ధిశాఖలో విస్తరణ అధికారి గ్రేడ్-1(సూపర్వైజర్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రకటన ఇచ్చారు. మొత్తం 22 పోస్టులను ప్రకటించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను psc.ap.gov.inలో చూసుకోవచ్చని, దరఖాస్తులు ఆన్లైన్లోనే సమర్పించాలని సూచించారు. మరోవైపు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.