యాప్స్‌ డేటా ట్రాక్‌ చేస్తే చెప్పేస్తుంది!

ABN , First Publish Date - 2021-07-31T06:15:25+05:30 IST

ఏ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ మీ డేటాను ట్రాక్‌ చేస్తోంది, ప్రాసెస్‌ చేస్తోంది అని మరింత పారదర్శకతను చెప్పే యత్నంలో గూగుల్‌ ఉంది.

యాప్స్‌ డేటా ట్రాక్‌ చేస్తే చెప్పేస్తుంది!

 ఏ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ మీ డేటాను ట్రాక్‌ చేస్తోంది, ప్రాసెస్‌ చేస్తోంది అని మరింత పారదర్శకతను చెప్పే యత్నంలో గూగుల్‌ ఉంది. ఇక నుంచి గూగుల్‌ ప్లేస్టోర్‌లో రిజిస్టర్‌ అయిన యాప్‌ డెవలపర్లు తమ సమాచారాన్ని తప్పనిసరిగా పొందుపరచాల్సిందే. తమ ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్‌ గురించి, ఆ యాప్‌ కలెక్ట్‌ చేసే పర్సనల్‌ డేటా గురించి ముందుగా తెలపాల్సి ఉంటుంది. దీనితోపాటు ఆ డేటాను ఎందుకు కలెక్ట్‌ చేస్తున్నారో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే ముందే యూజర్‌కు తెలపాల్సి ఉంటుంది. 


యాప్‌ లిస్టింగ్‌ పేజీలో ‘డేటా ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ సెక్షన్‌ కొత్తగా ఉంటుంది. ప్రత్యేకించి ఒక యాప్‌, లొకేషన్‌ సహా ఏ డేటాను ఎంత మేర సేకరిస్తోంది అన్నది తెలియజేస్తుంది. వివిధ కార్యకలాపాలు సహా సదరు డేటాను ఎవరితో షేర్‌ చేసుకుంటోంది వంటి విషయాలు కూడా తేటతెల్లమవుతాయి. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే సంవత్సరం మొదట్లో ఇది విడుదల అవుతుంది. సంపాదించిన సమాచారాన్ని హ్యాండిల్‌ చేసే విషయంలో పారదర్శకతను రాబడుతుంది. ఏదైనా యాప్‌ సెన్సిటివ్‌ లేదా పర్సనల్‌ డేటాను సేకరిస్తుంటే, పర్సనల్‌ అండ్‌ సెన్సిటివ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్షన్‌లో అదనంగా అవసరమైనవి డెవలపర్లు జతచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఫైనాన్షియల్‌ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే, అది బహిర్గతం కాకుండానే డెవలపర్స్‌ చూడాలి. 

Updated Date - 2021-07-31T06:15:25+05:30 IST