సింగోటం ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లకు ఆమోదం

ABN , First Publish Date - 2021-10-19T05:12:06+05:30 IST

లింగాకారంలో భక్తులకు దర్శనమిచ్చే ఆలయంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సింగోటం లక్ష్మీన ర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపనుంది.

సింగోటం ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లకు ఆమోదం
సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం అందజేస్తున్న ఎమ్మెల్యే బీరం

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడి

కొల్లాపూర్‌, అక్టోబరు 18 : లింగాకారంలో భక్తులకు దర్శనమిచ్చే ఆలయంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సింగోటం లక్ష్మీన ర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపనుంది. సురభిరాజుల కాలంలో నిర్మించిన ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. సింగోటం ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్ల ని ధులు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సోమవారం ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే సింగోటం ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా త్వరలో రూపుదిద్దుకోబోతుందన్నారు. నిధులు మంజూరుకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. 

Updated Date - 2021-10-19T05:12:06+05:30 IST