అపోలో టైర్స్... 40 % మార్కెట్‌ షేర్‌పై కన్ను

ABN , First Publish Date - 2021-10-26T02:33:42+05:30 IST

భారత టైర్ల మార్కెట్‌లో ప్రీమియం షేర్‌‌ను చేజిక్కించుకునే దిశగా అపోలో టైర్స్ దృష్టి సారించింది. తన యూరోపియన్ ప్రీమియం టైర్ బ్రాండ్ ‘రెడెస్టీన్’ను భారత్‌లోనూ పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది.

అపోలో టైర్స్... 40 % మార్కెట్‌ షేర్‌పై కన్ను

హైదరాబాద్ : భారత టైర్ల మార్కెట్‌లో ప్రీమియం షేర్‌‌ను  చేజిక్కించుకునే దిశగా అపోలో టైర్స్ దృష్టి సారించింది. తన  యూరోపియన్ ప్రీమియం టైర్ బ్రాండ్ ‘రెడెస్టీన్’ను భారత్‌లోనూ పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది. రెడెస్టీన్‌ను అపోలో టైర్స్‌ కొని దశాబ్దం దాటింది. ఇప్పటివరకు ఐరోపా మార్కెట్లకే ఈ టైర్లు పరిమితమయ్యాయి.


భారత్‌లో ప్రీమియం మార్కెట్‌కు అనుకూల సమయం కోసం ఎదురుచూసిన కంపెనీ... ఇప్పుడు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసుకుంది. ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఆలస్యంగా ప్రవేశించినందున, వ్రెడెస్టీన్ టైర్లతో టాప్-డౌన్ విధానంలో వెళ్లాలని కంపెనీ నిర్దేశించుకుంది. కాగా... 500సీసీ కంటే ఎక్కువ సామర్ధ్యమున్న హైఎండ్ టూ వీలర్ టైర్ సెగ్మెంట్‌లో అగ్రస్థానం కోసం కంపెనీ కసరత్తు చేస్తోంది. 

Updated Date - 2021-10-26T02:33:42+05:30 IST