నిర్మల్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-05-28T07:55:42+05:30 IST

నిర్మల్‌, మే 27 ( ఆంధ్రజ్యోతి ): నిర్మల్‌ పురపాలక సంఘం పరిధిలోని పారిశుధ్య కార్మికుల నియామకాల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ‘అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు’ పేరిట

నిర్మల్‌ పారిశుధ్య కార్మికుల నియామకాలకు బ్రేక్‌

విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు అప్పటిదాకా నియామక ప్రక్రియ వాయిదా

ఉద్యోగ భర్తీ ఆపేయమని కలెక్టర్‌ను ఆదేశించా : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి 

నిర్మల్‌, మే 27 ( ఆంధ్రజ్యోతి ): నిర్మల్‌ పురపాలక సంఘం పరిధిలోని పారిశుధ్య కార్మికుల నియామకాల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ‘అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు’ పేరిట ఆంధ్రజ్యోతి మెయిన్‌లో శుక్రవారం ప్ర చురితమైన కథనంతో పారిశుధ్య కార్మికుల ఉద్యోగానికి చేపట్టిన ఎంపికల్లో జరిగిన అవినీతి బాగోతం రట్టు అ య్యింది. దీంతో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించిన కలెక్టర్‌.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామక ప్రక్రియ ను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేశారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని  ఆర్డీవోను ఆదేశించారు. అయితే, నియామక ప్రక్రియ ను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో కలెక్టర్‌ ఉన్నారని సమాచారం. కాగా, కలెక్టర్‌ నుంచి ప్రకటన విడుదలైన తర్వాత మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియామకాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని తానే కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పా రు.  కాగా, పారిశుధ్య కార్మికుల నియామకాల్లో జరిగి న అవినీతిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడి, నిరసన దీక్ష ను పోలీసులు అడ్డుకున్నారు. మహేశ్వర్‌ రెడ్డిని హౌజ్‌ అరెస్టు చేసిన పోలీసులు పార్టీ శ్రేణులు పట్టణంలోకి రాకుండా చేశారు. దీంతో ఆయన తన నివాసం లో దీక్ష ప్రారంభించగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సహా పలువురు నేతలు ఆయనకు మద్దతుగా అక్కడికి చేరారు. జీవన్‌ రెడ్డి.. మహేశ్వర్‌ రెడ్డితో దీక్ష విరమింపజేశారు. నియామక ప్రక్రియ పూ ర్తిగా రద్దు చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఏలేటీ ఈ సందర్భంగా ప్రకటించారు. మునిసిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డి మాండ్‌ చేశారు. కాగా, అవినీతి బాగోతంలో మంత్రికి భాగస్వామ్యం ఉందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్‌, ముసిసిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ తమ పదవులకు రాజీనామా చేయకుంటే ప్రజలే వారిని తరిమికొడతారని హెచ్చరించారు.  

Updated Date - 2022-05-28T07:55:42+05:30 IST