నియామకాలు కుటుంబానికే పరిమితం

ABN , First Publish Date - 2020-08-03T11:22:30+05:30 IST

నీళ్లు ఆంధ్రోళ్లకు, నిధులేమో ఆంరఽధా కాంట్రాక్టర్లకు, నియామకాలు కుటుంబానికి పరిమితం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉద రగొట్టిన నీళ్లు

నియామకాలు కుటుంబానికే పరిమితం

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్‌మాదిగ


బిజినేపల్లి, ఆగస్టు2 : నీళ్లు ఆంధ్రోళ్లకు, నిధులేమో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు, నియామకాలు కుటుంబానికి పరిమితం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉద రగొట్టిన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని ఆయనకు అనువుగా నిజం చేసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్‌ మాదిగ విమర్శించారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎన్నికల ముందు కొత్తగా లక్ష ఉద్యో గ నియామకాలు చేపడుతానని సీఎం కేసీఆర్‌ చెప్పి నేడు ఉన్న ఉద్యోగుల ను తొలగించి ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తానని చెప్పి ఇప్పటికే 20 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌  మహమ్మారితో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. 


కృష్ణానది నీటిని పక్క రాష్ట్రం తరలించుకపో వడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన నీళ్లు, ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ సీఎం ఉద్యోగం ఉడగొట్టాలన్నారు. ప్రస్తుతం ప్రజలు కరోనా నుంచి ప్రభుత్వం కాపాడుతుందన్న భ్రమను వదిలి ఎవరికి  వారు స్వీయ నియం త్రణ పాటించి జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. అనంతరం డీఎస్‌ మాస్‌ ద్వారా దళిత నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సా యం అందించేందుకు ఆర్హులకు ఇంటర్వూలు నిర్వహించారు.  ఎంపీటీసీ మౌనిక మల్లేష్‌, నాయకులు మహేందర్‌, లేట్ల వెంకట్‌, ప్రశాంత్‌, జైపాల్‌, ఉశన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-03T11:22:30+05:30 IST