సజ్జలకు ‎ఓఎస్‌డీగా దశరథరామిరెడ్డి నియామకం

ABN , First Publish Date - 2021-07-16T00:07:27+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ‎ఓఎస్‌డీగా దశరథరామిరెడ్డి నియామించారు. ప్రస్తుతం దశరథరామిరెడ్డి

సజ్జలకు ‎ఓఎస్‌డీగా దశరథరామిరెడ్డి నియామకం

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ‎ఓఎస్‌డీగా దశరథరామిరెడ్డి నియామించారు. ప్రస్తుతం దశరథరామిరెడ్డి తెలంగాణ జైళ్లశాఖ సూపరింటెండెంట్‌గా ఉన్నారు. దశరథరామిరెడ్డిని డిప్యుటేషన్‌పై నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దశరథరామిరెడ్డిని తక్షణం రిలీవ్ చేస్తూ సర్వీస్ రిజిష్టర్‌ను అమరావతిలోని జీఏడీకి అందజేయాలని తెలంగాణను ఏపీ ప్రభుత్వం కోరింది.

Updated Date - 2021-07-16T00:07:27+05:30 IST