కుమార్‌రెడ్డి, రాధాకృష్ణ
తిరుపతి(ఆటోనగర్), జూన్ 30: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.కుమార్‌రెడ్డి, కె.రాధాకృష్ణలను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు తెలిపారు. బైరాగిపట్టెడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏఐటీయూసీ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్మిక సమస్యలకోసం వీరు నిరంతరం పోరాటాలు చేస్తారని చెప్పారు. నూతనంగా ఎంపికైన వారిని రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి వెంకటసుబ్బయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హరినాథరెడ్డి, రాష్ట్ర నేత ఎ.రామానాయుడు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెంచలయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి అభినందించారు.