పీపీని వెంటనే నియమించండి

ABN , First Publish Date - 2021-04-16T10:02:47+05:30 IST

చిత్తూరు మాజీ మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను వెంటనే నియమించాలని

పీపీని వెంటనే నియమించండి

చిత్తూరు మాజీ మేయర్‌ దంపతుల హత్యకేసులో నిందితుడికి బెయిల్‌ నిరాకరణ 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను వెంటనే నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేదంటే అమిక్‌సక్యూరీని నియమించి కేసు విచారణను వేగవంతం చేయాలని చిత్తూరు నాలుగో అదనపు జిల్లా కోర్టును ఆదేశించింది. ఈ కేసులో నిందితుడు శ్రీరాం చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై  న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్‌ నిరాకరించింది.  

Updated Date - 2021-04-16T10:02:47+05:30 IST