Abn logo
Sep 21 2021 @ 00:10AM

బోధనేతర సిబ్బందిని నియమించాలి: ఎమ్మెల్సీ

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 20: ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు పథకం కింద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లే బోధనేతర సిబ్బందిని, ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.గోకారి, పెద్దపాడు దామోదర్‌ సంజీవయ్య ఉన్నత పాఠశాల (బాలికలు)ను కత్తి నరసింహారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్‌ చేయడానికి ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ను నియమించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్‌ గౌడు, వెంకటస్వామి, షఫీ తదితరులు పాల్గొన్నారు.