కేంద్ర ప్రభుత్వ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T05:39:58+05:30 IST

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునిప్రతిభ చూపించిన వయో వృద్ధులకు కేంద్రప్రభుత్వం అవార్డులను ప్రధానం చేయనుందని అందుకు అర్హులైన వారు దరఖాస్తుచేసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ రమ్య తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డిటౌన్‌,ఆగస్టు 8: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునిప్రతిభ చూపించిన వయో వృద్ధులకు కేంద్రప్రభుత్వం అవార్డులను ప్రధానం చేయనుందని అందుకు అర్హులైన వారు దరఖాస్తుచేసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ రమ్య తెలిపారు. వివిధ రంగాలలో ప్రతిభ చూపి విశేష కృషిచేసిన 60 ఏళ్లపైబడిన వృద్ధులకు సేవలు, సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు వివిధ కేటాగిరిల్లో వయో శ్రేష్ట సమ్మాన్‌ అవార్డుతో అక్టోబరు 1న కేంద్రప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో అర్హులైన వారు దరఖాస్తుచేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2022-08-09T05:39:58+05:30 IST