ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీవో

ABN , First Publish Date - 2021-05-12T06:50:36+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్స్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరం కోసం 6వ

ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీవో

ఉట్నూర్‌, మే 11: రాష్ట్రం ప్రభుత్వం, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్స్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరం కోసం 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాల ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గంగాధర్‌ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, సిర్పూర్‌(టి)లలో ఉన్న ఏకలవ్య రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కల్పించడానికి ప్రతీ పాఠశాలలో 60 ఖాళీలు ఉన్నాయని, బాలురకు 30, బాలికలకు 30 సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు.. 5వ తరగతి పూర్తిచేసిన వారు దరఖాస్తులను  ఆన్‌లైన్‌లో ఈ నెల 31 వరకు చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-05-12T06:50:36+05:30 IST