ఇసుక క్వారీలకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-06-10T06:50:32+05:30 IST

జిల్లాలో ఇసుక క్వారీల అనుమతి కోసం పావులు కదుపుతున్నా రు. మంజీరా వెంట ప్రైవేట్‌ భూములో ఇసుక తవ్వకాలకు ధరఖాస్తులు చేశారు. ప్రజాప్రతినిధుల అండతో అనుమతులకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కమిటీ దరఖాస్తులను పరిశీలించగా..

ఇసుక క్వారీలకు దరఖాస్తులు

జిల్లాలో మంజీరా వెంట తవ్వకాలు  

పర్యావరణ అనుమతులకు పంపిన అధికారులు 

జిల్లాలో ఇప్పటికీ ఇసుక అక్రమ తవ్వకాలు 

నిజామాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి ప్రతినిది): జిల్లాలో ఇసుక క్వారీల అనుమతి కోసం పావులు కదుపుతున్నా రు. మంజీరా వెంట ప్రైవేట్‌ భూములో ఇసుక తవ్వకాలకు ధరఖాస్తులు చేశారు. ప్రజాప్రతినిధుల అండతో అనుమతులకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కమిటీ దరఖాస్తులను పరిశీలించగా.. పర్యావరణ అనుమతుల కోసం పంపించారు. ఆ శాఖ నుంచి అను మతులు రాగానే పెద్దు ఎత్తున తవ్వేందు కు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పర్యావరణ అనుమతుల కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇసుకకు పెరిగిన డిమాండ్‌ 

జిల్లాలో ఇసుక డిమాండ్‌ పెరిగింది. జిల్లా తో పాటు హైదరాబాద్‌ వరకు ఇసుక అవసరం పెరుగుతుండడంతో అక్రమార్కులు రాత్రి వేళలో మంజీరాతో పాటు ఇతర వాగులలో తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి వేళలో ఇసుకను తరలించి డంపులలో నిల్వ ఉంచుతున్నారు. గోదావరి వెంట కూడా ఇసుకను తోడేస్తున్నారు. జిల్లాలోని కోటగిరి, బోధన్‌ మండలాల పరిధిలోని పొతంగల్‌, మంజీరా, హున్సా తో పాటు పలు గ్రామాల పరిధిలో ఈ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రెంజల్‌ మండలం పరిధిలోని కందకుర్తి వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఆర్మూర్‌, డిచ్‌పల్లి, నవీపేట, మాక్లూర్‌, మోర్తాడ్‌, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, మోపాల్‌, వేల్పూర్‌ మండలాల పరిధిలోని పూలాంగ్‌, పెద్దవాగుతో పాటు ఇతర వాగులలో తవ్వకాలు చేస్తున్నారు. ట్రాక్టర్ల టిప్పర్ల ద్వారా ఈ ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ అవసరాలకు మాత్రమే తమ సమీపంలోని వాగుల నుంచి తహసీల్దార్‌లు ప్రస్తుతం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారు. వారికి అభివృద్ధి పనుల ఆధారంగా ఇసుకను కేటాయిసస్తున్నారు. ఈ అభివృద్ధి పనులకు ఇచ్చే ఇసుకను కూడా కొంత భాగాన్ని అక్రమంగా తరలించి బయట అమ్మకాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటిల పరిధిలో ఈ ఇసుక ను డంపులలో నిల్వ చేశారు. ఇవేకాకుండ గోదావరి, మంజీర పరిధిలోను ఇసుక నిల్వలు ఉన్నాయి. జిల్లాలో ఇసుక అనుమతులు లేకుండ తవ్వకాలు జరుగుతుండగా.. కొంతమంది ప్రైవేట్‌ భూములలో ఇసుక తవ్వకాల కోసం మంజీరా వెంట క్వారీలకు దరఖాస్తులను చేశారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లా పరిధిలో మంజీరా వెంట బీర్కుర్‌, బిచ్కుంద మండలా లో ఇసుక  క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో ఆరు నెలలుగా నిత్యం వందలాది లారీల ద్వారా తరలింపు చేస్తున్నారు. మంజీరాను మొత్తం తోడేస్తున్నారు. నిర్ణయించిన భాగంలో తవ్వా ల్సి ఉండగా యంత్రాలను పెట్టి భారీగా తోడేస్తున్నారు. అక్కడ ఇసుక తగ్గుతుండడంతో మంజీరా కింది భాగంలో ఉన్న కోటగిరి, బోధన్‌ మండలాల పరిధిలోని రెండు క్వారీలకు, కల్టూరు, ఒక్కోక్క క్వారీ కోసం దరఖాస్తులను చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన జిల్లా కమిటీ పర్యవరణ కమిటీ అనుమతుల కోసం పంపించా రు. మంజీరా ఒడ్డు వెంట ఉన్న ప్రైవేట్‌ భూ ములలో వరద వల్ల ఇసుకమెట్‌లు వేశామని, వాటిని తీసేందుకు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తులను చేశారు. అంతేకాకుండా ఈ క్వారీలను టీఎస్‌ ఎండీసీకి మంజూరు చేయనున్నారు.

మంజీరా వెంట తవ్వకాలకు అనుమతి

టీఎస్‌ఎండీసీ నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు అనుమతులు తీసుకుని తవ్వకా లు చేపట్టనున్నారు. మంజీరా వెంట ఇసుక తవ్వకాలకు గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అలాగే, మధ్యలో రెండేళ్లు క్వారీలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం గత సంవత్సరం కామారెడ్డి జిల్లా పరిధిలో బీర్కుర్‌, బిచ్కుందలో ఇచ్చారు. అదే తరహాలో ఈ జిల్లాలో కూడా ఐదు క్వారీలకు త్వరలో అనుమతి ఇవ్వనున్నారు. వర్షకాలం మొదలవుతుండగా మంజీరాకు వరద రానుంది. పర్యావరణ అనుమతులు వచ్చిన వరదలు తగ్గిన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నారు. మంజీరాలో అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ పర్యవరణ ట్రిబ్యునల్‌లో రేలా అనే స్వచ్చంద సంస్థ కేసులను వేసింది. అయిన తవ్వకాలు మాత్రం ఆగలేదు. జిల్లాలో మంజీరా వెంట ఐదు ఇసుక క్వారీల అనుమతి కోసం పర్యవరణ శాఖకు పంపించామని గనులు, భూగర్భశాఖ ఏడీ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు మాత్రం అనుమతులు రాలేదన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులకు తహసీల్దార్‌లు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. కమిటీ ఆధ్వర్యంలోనే ఈ దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-06-10T06:50:32+05:30 IST