CCMBలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2022-06-16T21:54:40+05:30 IST

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

CCMBలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 10

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌: 07

2. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

3. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌:01

4. సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.78,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: జూన్‌ 17

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/

Updated Date - 2022-06-16T21:54:40+05:30 IST