Abn logo
Oct 2 2020 @ 03:43AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు దరఖాస్తులు

ద్రాక్షారామ, అక్టోబరు 1: ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటు నమోదు చేసుకోవాలని అసిస్టెంట్‌  రిటర్నింగ్‌ అధికారి తేజేశ్వరరావు కోరారు. అర్హులైన ఉపాధ్యాయులు రామచంద్రపురం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి నుంచి ఫారం 19 దరఖాస్తు తీసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతపరచి ఈనెల 1 నుంచి  6 దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిసెంబరు 1న ముసాయిదా ప్రకటిస్తారని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 18న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్‌ తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్‌, ఎంఈవో, ఉన్నత పాఠశాలల వద్ద ప్రచురించారు. 


Advertisement
Advertisement
Advertisement