25,388..పట్టభద్రుల ఓటు నమోదుకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-11-07T09:26:54+05:30 IST

మహబూబ్‌నగర్‌ - హైదరాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది

25,388..పట్టభద్రుల ఓటు నమోదుకు దరఖాస్తులు

జిల్లాలో అనూహ్య స్పందన 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : మహబూబ్‌నగర్‌ - హైదరాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. గత నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఓటర్ల నమోదు ప్రక్రియ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వరకు పట్టభద్రుల నుంచి 25,338 దరఖాస్తులు రాగా, వాటిలో 24,009 ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో 1,379 వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే 3,725 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. వికారాబాద్‌ డివిజన్‌పరిధిలో 17,089 దరఖాస్తులు రాగా, తాండూరు డివిజన్‌ పరిధిలో 8,299 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో వచ్చిన 24,009 ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 5758 దరఖాస్తులను పరిశీలించి తహసీల్దార్లు ఏఈఆర్‌వోల (ఆర్డీవోలు)కు పంపించారు. 18,251 దరఖాస్తులు ఇంకా తహసీల్దార్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులపై విచారణ నిర్వహించి అన్నీ సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకున్న తరువాత ఏఈఆర్‌వోకు పంపించాల్సి ఉంటుంది. పట్టభద్రులు వ్యక్తిగతంగా 1379 దరఖాస్తులు అందజేయగా, వాటిలో 1,212 దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశారు.


అయితేవీటిలో 167 దరఖాస్తులను తదుపరి చర్యల కోసం ఏఈఆర్‌వోలకు పంపించారు. తహసీల్దార్ల లాగిన్‌లో 18,251 దరఖాస్తులు, ఏఈఆర్‌వో లాగిన్‌లో 5,527 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈఆర్‌వో లాగిన్‌లో 398 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చిన దరఖాస్తులపై విచారణ నిర్వహించి వచ్చేనెల ఒకటో తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. ఓటరు జాబితాల్లో ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే డిసెంబరు 31 వరకు తెలియజేయాల్సి ఉంటుంది. 2021, జనవరి 12వ తేదీలోగా వాటిని పరిష్కరించి 18వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. 


పట్టభద్రుల  ఓటరు నమోదుపై విచారణ

తాండూరురూరల్‌ : తాండూరులో పట్టభద్రుల ఓటు నమోదు  దరఖాస్తులపై కొంతమంది ప్రైవేటు విద్యార్థులు విచా చేయడంపై పట్టణ యువకులు శుక్రవారం తాండూరు తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణంలోని 20, 21వ వార్డులో కొందరు డిగ్రీ పూర్తి చేసిన యువకులు  పట్టభద్రుల ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అట్టి దరఖాస్తులను వీఆర్వోలు అంజి, నరేష్‌ ఇద్దరు కలిసి విచారణ చేపట్టాల్సి ఉండగా,  ప్రైవేటు వ్యక్తులు విచారణ చేస్తున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తహసీల్దార్‌, వీఆర్వోలు, బీఎల్‌వోలతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 


పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్న కౌన్సిలర్‌

తాండూరు : తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌, నియోజకవర్గ టీజేఎస్‌ ఇన్‌చార్జీ సోంశేఖర్‌ శుక్రవారం పట్టభద్రుల ఓటునమోదు చేసుకున్నారు. తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడుకు దరఖాస్తును అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ, ఉపాధి,  సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడికి ఓటు వేసి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.

Updated Date - 2020-11-07T09:26:54+05:30 IST